తెలుగు సినిమాలో ఈ మధ్యన కొత్త సినిమాలు కమర్షియల్ సినిమాలకు ధీటుగా ఆడుతున్నాయి. స్టార్లు నటించిన మూవీస్ తో పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త వాళ్లు తమదైన ముద్ర కనబరుస్తున్నారు. ఇలాంటి టాలెంట్ కలిగిన దర్శకులలో ఆనంద్ వీఐ ఒకడు.
ఇటీవలే కమెడియన్ నుంచి దర్శకుడిగా మారిన వేణు తీసిన బలగం యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. దీనిని దిల్ రాజు నిర్మించాడు. ఇది రికార్డుల మోత మోగించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే కలెక్షన్స్ రాబట్టింది.
హీరో, హీరోయిన్లను ఈ మధ్య ఎవరూ పట్టించు కోవడం లేదు. కేవలం కంటెంట్ ఉందా లేదా అని సినిమాను చూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యను పక్కన పెట్టారు. భోళా శంకర్ ను పట్టించు కోలేదు. ఇక ఊరు పేరు భైరవకోన పేరుతో ముందుకు వస్తోంది కొత్త చిత్రం.
ఆనంద్ టేకింగ్, మేకింగ్ విషయంలో డిఫరెంట్ . తను ఇంతకు ముందు ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలు తీశాడు. ఇక సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు భారీ ఆదరణ లభించింది. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇది కూడా కెవ్వు కేక అనేలా ఉంది.
