ఎంతో ఉత్కంఠ రేపిన మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. థాయిలాండ్ కు చెందిన సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విజేతగా నిలిచింది. ప్రపంచ కిరీటాన్ని అందుకున్నారు. గత ఏడాది 2024లో క్రిస్టినా పిజ్కోవా సుచాతా చువాంగ్ కు అందించారు. ఈ పోటీల్లో 2వ రన్నర్ అప్ గా మిస్ పోలెండ్, 3వ రన్నర్ అప్ గా మిస్ మార్టినిక్ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా వరల్డ్ బ్యూటీగా గెలుపొందిన సుచాత చువాంగ్ శ్రీకి ఏకంగా రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.
ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. తమ దేశానికి చెందిన సుందరికి కిరీటం దక్కడంతో థాయిలాండ్ లో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ప్రపంచ సుందరిగా ఎంపికైన సుచాత సువాంగ్ శ్రీ జీవితం స్పూర్తి దాయకంగా నిలిచారు. తను 16 ఏళ్ల వయస్సు లోనే క్యాన్సర్ వ్యాధికి గురైంది. కష్టపడి దానిని అధిగమించింది. ప్రస్తుతం తను థాయిలాండ్ లో రొమ్ము క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటోంది. నిధులను సేకరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన స్వచ్చంధ సంస్థలతో కలిసి పని చేస్తోంది తను.
టాప్ 8మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల సుందరీమణులు నిలిచారు. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని ఎంపిక చేశారు.