భారత దేశంలో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాస్ ప్రతి ఏటా ఆయా సినిమా రంగాలకు సంబంధించి ఎవరు టాప్ లో ఉన్నారనే దానిపై జాబితా ప్రకటిస్తుంది. ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. తెలుగు సినిమా రంగానికి సంబంధించి నటుడు డార్లింగ్ ప్రభాస్ టాప్ లో నిలిచాడని తెలిపింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ రిలీజ్ కానుంది. గతంలో రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలు ఆశించిన మేర ఆడలేదు. కానీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది ఆర్మాక్స్.
ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రకటించిన లిస్టులో ప్రభాస్ టాప్ లో నిలవడం విశేషం.
ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ , మహేష్ బాబు, రామ్ చరణ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక 6వ స్థానంలో పవన్ కళ్యాణ్, 7వ స్థానంలో రౌడీగా పేరు పొందిన విజయ్ దేవరకొండ, 8వ స్థానంలో నాని, 9వ స్థానంలో చిరంజీవి, 10వ స్థానంలో రవితేజ నిలిచారని ఆర్మాస్ మీడియా సంస్థ వెల్లడించింది.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సమంత టాప్ లో నిలిచింది.
