Pailam Pilaga: సాయి తేజ ‘పైలం పిలగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

సాయి తేజ ‘పైలం పిలగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

Hello Telugu - Pailam Pilaga

Pailam Pilaga: నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, ఇంకా చాలా మంది బాలీవుడ్ అగ్ర నటులతో సహా వందకు పైగా యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన‌ ఆనంద్ గుర్రం మొదటి సారి దర్శకత్వం వ‌హిస్తూ తెర‌కెక్కించిన చిత్రం ‘పైలం పిల‌గా(Pailam Pilaga)’. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ కల్వకోట హీరోగా నటించారు. పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్‌గా నటించింది. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించింన ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.

Pailam Pilaga Movie Updates

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల నందమూరి నట సింహాం బాలయ్య ఈ ‘పైలం పిలగా’ చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా’అని మేకర్స్‌ తెలిపారు.

Also Read : All We Imagine as Light: ఆస్కార్‌ బరిలో ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com