India Shocking :పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి బహిష్కర‌ణ

భార‌త ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

India : ఢిల్లీ – భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైక‌మిష‌న్ లో ఉద్యోగిగా ప‌ని చేస్తున్న రెహ‌మాన్ ను బ‌హిష్క‌రించింది. వెంట‌నే దేశం విడిచి వెళ్లి పోవాల‌ని ఆదేశించింది. ఇక్క‌డ ఉంటూ పాకిస్తాన్ లోని ఐఎస్ఐకి స‌మాచారం చేర వేస్తున్నాడ‌ని, ఈ మేర‌కు నిఘా వ‌ర్గాలు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించాయ‌ని పేర్కొంది. అందుకే చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది.

India Shocking to Pakistan High Commission

అధికారిక పాత్రకు మించిన కార్యకలాపాలకు పాల్ప‌డుతున్నాడ‌ని కేంద్రం ఆరోపించింది. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ హై క‌మిష‌న్ లో ఉద్యోగుల సంఖ్య‌ను కూడా త‌గ్గించాల‌ని స్ప‌ష్టం చేసింది. రెహ‌మాన్ ను 24 గంట‌ల లోపు భారత దేశాన్ని విడిచి వెళ్లాల‌ని ఆదేశించింది. ఒక్క నిమిషం ఇక్క‌డ ఉండేందుకు వీలు లేద‌ని పేర్కొంది. ఇక్క‌డ ఉంటూ కీల‌క స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఐఎస్ఐకి చేర‌వేస్తుండ‌డంతో చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. త‌న అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు గాను రెహ‌మాన్ పై వేటు వేశామ‌ని వెల్ల‌డించింది.

Also Read : Minister Vangalapudi Anitha Interesting :ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com