Parineeti Chopra : బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన పరిణీతి చోప్రా ఉన్నట్టుండి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం జరిపింది. ఆ తర్వాత విదేశాలలో పర్యటించారు. కెమెరా కళ్లకు చిక్కారు. ఇటీవలే ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా సాగింది.
Parineeti Chopra Gift
ప్రియాంక చోప్రాకు బంధువు కూడా అవుతుంది పరిణీతి చోప్రా(Parineeti Chopra). కేవలం ఎంపిక చేసిన కొందరు మాత్రమే వీరి మ్యారేజ్ కు అటెండ్ అయ్యారు. తాజాగా ఇన్ స్టా లో తామిద్దరం కలిసి లేటెస్ట్ గా దిగిన ఫోటోలను షేర్ చేసింది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా.
విచిత్రం ఏమిటంటే రాఘవ్ చద్దా పుట్టిన రోజు కావడంతో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. తను చద్దాకు మరిచి పోలేని ముద్దుతో సరి పెట్టింది. ఇద్దరూ ప్రేమ పక్షుల్లా కలిసి పోయారు. అయితే రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఉన్నారు. పంజాబ్ సర్కార్ కు అడ్వైజర్ గా సేవలు అందిస్తున్నారు.
విద్యా వంతుడిగా పేరు పొందారు. అత్యంత పిన్న వయసు కలిగిన ఎంపీగా ఉన్నారు. ఇటీవలే ఆప్ హర్భజన్ సింగ్ తో పాటు రాఘవ్ చద్దాకు ఎంపీ సీట్లను కేటాయించింది.
Also Read : Tiger 3 Movie : అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్
