Pawan Kalyan : అగ్ర నటుడు మిథున్ చక్రవర్తి కి అభినందనలు తెలిపిన పవన్

ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి...

Hello Telugu - Pawan Kalyan

Pawan Kalyan : సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది. అక్టోబర్ 8న జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైన మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Pawan Kalyan Praises…

ఈ ప్రకటనలో ‘‘ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తిగారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. మిథున్ చక్రవర్తిగారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘ డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు.హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను..’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read : Saripodhaa Sanivaaram OTT : ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకుపోతున్న నాని సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com