ప‌వ‌ర్ స్టార్ ఉస్తాద్ పై ఫోక‌స్

ఓజీ మూవీ షూటింగ్ లో బిజీ

టాలీవుడ్ లో ద‌మ్మున్న డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు హ‌రీష్ శంక‌ర్. త‌ను రీమేక్స్ ను తీయ‌డంలో దిట్ట‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోని న‌టుడిని తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించేలా చేసిన మూవీ గ‌బ్బ‌ర్ సింగ్. ఇది హిందీలో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ద‌బాంగ్ కు రీమేక్. అయినా ఎక్క‌డా ఆ ఛాయ‌లు లేకుండా తీశాడు. ఆ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికీ అందులోని డైలాగులు చాలా చోట్లా య‌ధాలాపంగా వాడుతుంటారు. అంత‌లా ఆక‌ట్టుకునేలా, బుల్లెట్ల‌లా దూసుకు పోయేలా రాశాడు. ఈ క్రెడిట్ అంతా హ‌రీశ్ శంక‌ర్ కే ద‌క్కుతుంది.

ఇది ప‌క్క‌న పెడితే గ‌తంలో త‌ను ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ పవ‌ర్ స్టార్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. పోస్ట‌ర్స్ కూడా రిలీజ్ చేశాడు. ఇందులో అందాల తార శ్రీ‌లీల కీ రోల్ పోషిస్తోంది. త‌ను ఓర కంటితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూస్తున్న ఫోటో షేర్ చేశాడు. ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాను ఇప్ప‌టికీ షేక్ చేస్తోంది ఆ ఫోటో. త‌న టేకింగ్, మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఆ మ‌ధ్య‌న మాస్ మ‌హారాజాతో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తీశాడు. ఎందుక‌నో ఆక‌ట్టుకోలేక పోయింది.

పీపుల్స్ మీడియాకు న‌ష్టం తీసుకు వ‌చ్చింది. కానీ ఇందులో కొత్త హీరోయిన్ గా తీసుకు వ‌చ్చాడు హ‌రీశ్ శంక‌ర్. ఆ అమ్మాయే భాగ్య‌శ్రీ బోర్సే. త‌న‌కు ఈ సినిమా ప్ల‌స్ పాయింట్ కాక పోయినా ఆశించిన దానికంటే ఎక్కువ‌గా ఆప‌ర్స్ వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. త‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కింగ్ డ‌మ్ లో న‌టించింది. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. రామ్ పోతినేనితో షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక దుల్క‌ర్ స‌ల్మాన్ తో సంత‌కం చేసింది. ఈ స‌మ‌యంలో హ‌రీశ్ వంక‌ర్ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటాడ‌ని స‌మాచారం. మొత్తంగా మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు హ‌రీశ్ శంక‌ర్ రెడీగా ఉన్నాడ‌న్న‌మాట‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com