Pawan Kalyan : దమ్మున్న నిర్మాత ఎంఎం రత్నం. తనకు పవన్ కళ్యాణ్ తో మంచి స్నేహం ఉంది. అంతకు మించిన నమ్మకం కూడా. తన నిర్మాణ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకుంటున్న చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). వాస్తవానికి ఈ నెలలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా బిజీగా ఉండడంతో షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పవర్ స్టార్ స్వయంగా పాట పాడటం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ కు మంచి స్పందన లభించింది.
Pawan Kalyan – Hari Hara Veera Mallu Movie Updates
సాధ్యమైనంత త్వరగా షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రధాన సన్నివేశాలను ఇప్పటికే దర్శకుడు జ్యోతి కృష్ణ చిత్రీకరించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలలో షూటింగ్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఏది ఏమైనా సరే వచ్చే మె నెల 9వ తేదీన పక్కాగా విడుదల చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు నిర్మాత ఎంఎం రత్నం.
చిట్ చాట్ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచి పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కీలక పాత్రలలో నిధి అగర్వాల్ , నోరా ఫతేహి, అనసూయ భరద్వాజ్ , బాబీ డియోల్ నటించారు. మెగా, పవన్ కళ్యాణ్ కు చెందిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు ఈ మూవీ కోసం.
Also Read : Hero Ravi Teja : మరో ప్రాజెక్టుకు మాస్ మహారాజా ఓకే
