ప‌వ‌న్ ఫ్యాన్స్ కు పండుగ సినిమాలు నిండుగ‌

చిన్న గ్యాప్ లోనే రెండు భారీ మూవీస్

ఈ ఏడాది ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. తాను న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ తో తీసిన చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉండ‌డం మూలాన త‌ను ఎక్కువ స‌మ‌యం కేటాయించ లేక పోయాడు. దీంతో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఆల‌స్య‌మైంది. దీనిని ప్ర‌ముఖ నిర్మాత ఎంఎం ర‌త్నం తీశాడు. భార‌తీయ సినిమాలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న ఓ రేంజ్ లో ఉండ బోతోంద‌ని తెలిపాడు.

ఇక సినిమా ఎలా ఉన్నా త‌న‌కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. దీంతో ఒక్క మూవీ విడుద‌లైతే చాలు నిర్మాత‌ల‌కు కాసుల పంట పండ‌నుంది. ఇక ఈ ఏడాదిలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించి హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుతో పాటు మ‌రో మూవీ ఓజీ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ రెండూ ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇస్తాయ‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు మూవీ మేక‌ర్స్.

మ‌రో వైపు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ప‌వ‌ర్ స్టార్ తో మూవీ తీసి సంచ‌లనం సృష్టించిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్. వ‌స్తాద్ భ‌గ‌త్ సింగ్ ను గబ్బ‌ర్ సింగ్ కంటే భిన్నంగా, అద్భుతంగా తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇందులో కొత్తగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉండ‌బోతున్నాడ‌ని తెలిపాడు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే జూన్ 12న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com