ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇందులో చాలా కాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల , నిధి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం కావడంతో మెగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత , తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇందులో ప్రత్యేకంగా పరవ్ స్టార్ పాట పాడారు. ఇది యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే సినీ మార్కెట్ లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది ఈ మూవీకి. దీనికి కారణం పవర్ స్టార్ నటించడమే.
సినిమాను ఆరు నూరైనా సరే జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది సినీ వర్గాలలో. పవర్ స్టార్ మేనియా మూమూలుగా ఉండదు.
ఇక సినిమా విషయానికి వస్తే హరి హర వీరమల్లు సినిమా రూపొందేందుకు చాలా ఏళ్లు పట్టింది. మొదట క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించగా ఎందుకనో తను తప్పుకున్నాడు. ఇది పూర్తవుతుందా లేదా అన్న అనుమానం నెలకొనడంతో గత్యంతరం లేక నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేశాడు.