బెంగళూరు – పంటలను కాపాడడంలో కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా సహకరించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాలుగు కుంకీ ఏనుగులను సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. జనావాసాల్లోకి వచ్చి పంటలను విధ్వంసం చేసే గుంపు ఏనుగులను తరిమి కొట్టడంలో కుంకీ ఏనుగులు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు పవన్ కళ్యాణ్.
కర్ణాటక సర్కార్ ఏపీకి అందజేసింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను డిప్యూటీ సీఎంకు అందజేశారు. మానవులు, పంటలు, సంరక్షణకు ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం అత్యంత అవసరమని ఈ సందర్బంగా స్పష్టం చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ఇదిలా ఉండగా దేశంలోనే అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రంలో కర్ణాటకకు పేరుంది. ఇక్కడ ఏకంగా 3 వేల 695 ఏనుగులు ఉండడం విశేషం.
కుంకీ ఏనుగుల ఒప్పందం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఓ కీలక ముందడుగుగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్ కొణిదల. వీటిని అందజేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్.
