పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ శక్తులు ఎవరో గుర్తించాలన్నారు. దీనిపై విచారణ జరిపించాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వివరాలు తెలియ చేశారు పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. తన సినిమాకైనా సరే ఫిలిం చాంబర్ ద్వారానే తనతో కలవాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల నిర్వహణకు సంబంధించి కీలక మార్గ దర్శకాలను రూపొందించారు. ప్రజలకు, ముఖ్యంగా కుటుంబాలకు సినిమాను అందుబాటులోకి తీసుకు రావడంతో అందరికీ అందుబాటు ధరలో ఉంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి రావాలని ప్రోత్సహించేలా థియేటర్లలో టికెట్ , ఆహార ధరలు రెండింటినీ సహేతుకమైన పరిమితుల్లో ఉంచాలని ఆయన నొక్కి చెప్పారు. సినిమా ఒక కుటుంబ అనుభవం. అధిక ఖర్చుల భారం కాకుండా, థియేటర్లలో ప్రజలు స్వాగతం పలికేలా మనం చూసుకోవాలన్నారు.
టికెట్ ధరలను పెంచే ఏదైనా ప్రతిపాదనను తగిన మార్గాల ద్వారా మళ్ళించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ధరల పెంపుదల నిజంగా అవసరమైతే, ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనతో సినిమా చేసిన నిర్మాత ఎంఎం రత్నంకు కూడా ఇది వర్తిస్తుందన్నారు.
