తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో కీలకంగా మారిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో అమెరికాకు చెక్కేశాడు. దీంతో తనకు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. అయినా స్పందించక పోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు కీలకమైన అంశాలు వెలుగు చూశాయి.
ప్రభాకర్ రావు ఎంతకూ స్పందించక పోవడంతో, విచారణకు రాక పోవడంతో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సీరియస్ అయ్యింది. తక్షణమే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక ప్రభాకర్ రావు దారికి వచ్చాడు. తాను జూన్ 5న విచారణకు హాజరవుతానని తెలిపాడు. ఈ సమాచారాన్ని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసి ఇచ్చారు.
కాగా వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు వస్తానంటూ తెలిపారు. కోర్టు మాత్రం పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ఆదేశించింది. తను 14 నెలలుగా యుఎస్ లోనే తలదాచుకున్నాడు.