ప్రగతి పథంలో పిఠాపురం నియోజక వర్గం

ఏడాది కాలంలో రూ. 308 కోట్ల‌తో అభివృద్ది ప‌నులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు త‌న‌ను గెలిపించిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని. ఏడాది కాలంలో ఏకంగా రూ. 308 కోట్ల అభివృద్ది ప‌నులు చేప‌ట్టారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డారు. విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనతోపాటు పారిశుధ్యం, సంపద సృష్టిపై దృష్టి సారించారు. పల్లె పండుగ ద్వారా పిఠాపురం పల్లెల్లో రహదారులకు కొత్త కళ వచ్చింది. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయి. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 100 పడకల ప్రాంతీయ వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు.

సంక్షేమ హాస్టల్స్ వసతుల కల్పనకు శ్రీకారం చుట్టి విద్యార్థినుల్లో స్థైర్యం నింపారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించారు. రికార్డు స్థాయిలో మినీ గోకులాల నిర్మాణంతో రైతులకు అండగా నిలిచారు. మహిళా స్వయం ఉపాధి లక్ష్యంగా టైలరింగ్ లో శిక్షణ ఇప్పించడంతో పాటు కుట్టు మిషన్లు, రైతులకు టార్పాలిన్లు, సబ్సిడీపై యంత్ర సామాగ్రి అందచేశారు. పిఠాపురం ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్ గా అభివృద్ధి చేసేందుకు వీలుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. శాసన సభ్యుడిగా తన జీతాన్ని సైతం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని చిన్నారుల సంరక్షణకు అందజేసి అవకాశం ఉన్న ప్రతి రూపాయిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రగతికే వినియోగిస్తూ వచ్చారు.

ఏడాది పాలనలో రాష్ట్రంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలోనే నంబర్ స్థానంలో పిఠాపురం నియోజకవర్గాన్ని నిలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు వివిధ కార్పోరేట్ సంస్థల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారు. ఉప్పాడ తీర ప్రాంతం ఆటుపోట్లకు కోతకు గురవుతూ సముద్రం గర్భంలో కలసిపోతూ ఉంది. దీన్ని అరికట్టి తీర ప్రాంతాన్ని రక్షించేందుకు అధునాతన జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. ఎన్నికల సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత కోతకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెండవసారి నియోజకవర్గ పర్యటనలోనే కోత నివారణకు జాతీయ స్థాయి నిపుణులను పిలిపించి కోతకుగల కారణాలు, నివారణా చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com