PM Modi : ఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించిన చైనా, అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకరు చెపితే వినే స్థితిలో తాము లేమన్నారు. తాము ఉగ్రవాదంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. తమ సత్తా ఏమిటో ఆపరేషన్ సిందూర్ తో యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు.
PM Modi Strong Warning..
ఇదిలా ఉండగా తామంతకు తాముగా అమెరికా వద్దకు వెళ్లలేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇవాళ యావత్ ప్రపంచం ముందు నిస్సిగ్గుగా పాకిస్తాన్ తన తీరు ఏమిటో తనంతకు తానుగా బయట పడేసిందన్నారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ మరో వైపు నీతి సూత్రాలు వల్లించడం ఆ దేశానికి మామూలై పోయిందన్నారు. ఇంకోసారి తమ దేశం వైపు కన్నెత్తి చూసినా లేదా తాకాలని ప్రయత్నం చేసినా అంతకు బదులు తీర్చుకుంటామని బంగ్లాదేశ్, పాకిస్తాన్ , టర్కీ, చైనాలను ఉద్దేశించి హెచ్చరించారు.
Also Read : IPL 2025 Interesting Update :టాటా ఐపీఎల్ 2025 కొనసాగుతుందా..?