అమరావతి – దేశ ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నంలో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రపంచ యోగా డే సందర్బంగా రానున్నారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు వెళతారు. అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం 6.45కు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి మోడీ చేరుకుంటారు. ఈ సందర్బంగా పహల్గాం బాధిత కుటుంబంతో భేటీ అవుతారు. ప్రధాని రాక సందర్భంగా 12 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీపీ శంకభ్రత బాగ్చి.
ఇదిలా ఉండగా కాల్పుల్లో మరణించిన భార్య నాగమణి పేరును చివరగా చేర్చారు. 5 లక్షల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు సీపీ. విశాఖలో రేపటి యోగాంధ్ర వేడుకలకు భారీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్లతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్‌తో సీసీ కెమెరాలను అనుసంధానం చేయడం జరిగిందన్నారు బాగ్చి. ఇదిలా ఉండగా వేడుకలు జరిగే 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోగా డే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు.