సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్ డే వేడుక‌ల్లో గంజాయి..మ‌ద్యం

త్రిపుర రిసార్ట్ య‌జ‌మానితో పాటు మంగ్లీపై కేసు

హైద‌రాబాద్ – ప్రముఖ గాయ‌కురాలు మంగ్లీకి షాక్ త‌గిలింది. త‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా చేవెళ్ల‌లోని త్రిపుర రిసార్ట్ లో భారీ ఎత్తున విందు ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువురు హాజ‌ర‌య్యారు. పోలీసులు ఊహించ‌ని విధంగా ఝ‌ల‌క్ ఇచ్చారు. దాడులు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌లో అడ్డంగా దొరికి పోయింది మంగ్లీ. ఏకంగా గంజాయితో పాటు విదేశీ మ‌ద్యం దొరికింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పోలీసులు వెల్ల‌డించారు.

దీంతో సింగ‌ర్ మంగ్లీతో పాటు రీసార్ట్ య‌జ‌మాని శివ రామ‌కృష్ణ‌పై కేసేలు న‌మోదు చేశారు. దీంతో చ‌ట్ట ప‌రంగా ఇరుక్కున్నారు. గంజాయి తీసుకుంటూ దామోద‌ర్ అనే వ్య‌క్తి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డాడు.
న్న రాత్రి త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ బర్త్ డే వేడుక నిర్వ‌హించారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు స‌మాచారం అందించ‌డంతో రైడ్ చేశారు.

ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, విదేశీ మద్యం అక్రమంగా వడ్డించారని, ఒక వ్యక్తి గంజాయి (గంజాయి) సేవించి పట్టుబడ్డాడని తెలిసింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా కార్యక్రమంలో మద్యం సేవించినందుకు మంగ్లీపై కేసు నమోదు చేశారు.

ఈ పార్టీకి గాయకుడు దివి, గీత రచయిత కాసర్ల శ్యామ్ వంటి పరిశ్రమ ప్రముఖులు సహా మంగ్లీ స్నేహితులు హాజరయ్యారు. పోలీసులు వీరికి కూడా నోటీసులు జారీ చేయ‌నున్నారు. పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం ఎంతవరకు ఉందో పరిశీలించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉండ‌గా మంగ్లీ రాములో రాములా, బుల్లెట్ సాంగ్, సారంగ ధ‌రియా, భూమ్ బ‌ద్ద‌ల్, జింత‌క్ జింత‌క్ పాట‌ల‌కు ప్ర‌సిద్ది పొందింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com