Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యార్థులకు ఏపీ సైనిక్ స్కూల్స్‌లో స్థానిక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం , ఏపీ సర్కార్ ఏపీ సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదా ఇవ్వడం కొనసాగించాలని స్పష్టం చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైన దాదాపు 20,000 మంది తెలంగాణ విద్యార్థులు ఇటీవలి విధాన మార్పు కారణంగా తమ అడ్మిషన్ల గురించి అనిశ్చితంగా ఉన్నారని వాపోయారు.
Minister Ponnam Prabhakar Shocking Comments
ఏపీ ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదాను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. ఈ చర్య తెలంగాణ అంతటా తల్లిదండ్రులు, విద్యార్థులలో విస్తృత ఆందోళనకు కారణమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar).
దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రానికి సొంత సైనిక్ స్కూల్ ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతానికి సైనిక్ స్కూల్ లేనే లేదన్నారు. సైనిక్ స్కూల్‌లను త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని అన్నారు.
Also Read : Saraswathi Pushkaralu Interesting :మే 15 నుండి సరస్వతి పుష్కరాలు