Allu Arjun : బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను సూర్యతో నటించిన రెట్రో విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది మూవీ టీం. ఈ సందర్బంగా తన మనసులో మాటను బయట పెట్టింది. అల్లు అర్జున్, అట్లీ కుమార్ , సన్ పిక్చర్స్ తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీలో నటించే ఛాన్స్ లేక పోలేదంటూ పేర్కొంది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ముహూర్తమే స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా మార్కెట్ కు ఆరంభం కావడం విస్తు పోయేలా చేసింది.
Allu Arjun-Pooja Hedge Movie Updates
ఇక పూజా హెగ్డే తెలుగులో గతంలో విజయవంతమైన సినిమాలలో నటించింది..ఇక్కడి ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది. తను కెరీర్ పరంగా తొలి చిత్రం తమిళంలో స్టార్ట్ చేసింది. ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. వరుణ్ తేజ్ , అల్లు అర్జున్(Allu Arjun) , మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, డార్లింగ్ ప్రభాస్ లాంటి నటులతో నటించింది. ఎఫ్ 2 లో స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది కూడా.
ఇక అల్లు అర్జున్ తో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథంలో , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠ పురంలో కీ రోల్ పోషించింది. ఇదే దర్శకుడు తారక్ తో తీసిన అరవింద సమేతలో నటించింది పూజా హెగ్డే. ప్రస్తుతం తను బన్నీతో నటించడం ఖాయమని పేర్కొంది పూజా హెగ్డే.
Also Read : Bombay Re-Release Sensational :బొంబాయి మూవీని రిలీజ్ చేస్తే తట్టుకోలేరు
