Pooja Hegde : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే , సూపర్ స్టార్ సూర్య కలిసి నటించిన చిత్రం రెట్రో. ఈ మూవీ విడుదలకు ముందే అంచనాలు పెంచేలా చేసింది. టేకింగ్, మేకింగ్ లో తనదైన శైలిని కలిగి ఉన్న ఏకైక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీని మరింత ఆసక్తిని రేపేలా చిత్రీకరించారు. ఇప్పటికే ముందే ప్రకటించినట్లు మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో లీనం కాగా ఇతర నటీ నటులు కీ రోల్స్ పోషించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో దర్శక, నిర్మాతలు ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.
Pooja Hegde-Suriya Retro Movie
రెట్రోలో పూజా హెగ్డేను(Pooja Hegde) పూర్తిగా సాంప్రదాయ బద్దంగా, మరింత అందంగా ఉండేలా తీర్చి దిద్దాడు దర్శకుడు. ఫ్యాన్స్ కూడా ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ , ట్రైలర్, సాంగ్స్ కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే అభిమానులు ఆశించిన రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో లేక పోవడం గమనార్హం. ఘాటైన, మరింత ఆకర్షణీయమైన పాత్రలో కనిపించవచ్చని అనుకున్న వారికి నిరాశ తప్పదు.
కార్తీక్ సుబ్బరాజ్ పూజా హెగ్డే పాత్రను కుటుంబ పరంగా ఉండేలా చేశాడు. ఇందుకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. తన పాత్ర చుట్టూ ఎటువంటి బజ్ లేక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సూర్య కు భార్య పాత్రను పోషించింది తను. తన సినిమాలలో హీరోయిన్లకు ప్రయారిటీ ఎక్కువగా ఇస్తాడు దర్శకుడు. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తాడు. తను గతంలో తీసిన పెట్ట, నవరస, మహాన్, జిగర్తాండ మూవీస్ లలో పాత్రలు మరింత శక్తివంతంగా ఉండేలా చేశాడు.
Also Read : Hero Dhanush-Periyasamy :పెరియసామితో ధనుష్ మూవీకి సిద్దం