భారతీయ సినీ చరిత్రలో అత్యంత పాపులర్ హీరోగా గుర్తింపు పొందాడు డార్లింగ్ ప్రభాస్. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. కన్నప్ప పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహు బలిలో ప్రభాస్ నటించి మెప్పించాడు. బాహు బలి -2 మూవీలో సైతం తనే నటించి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించింది.
ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ ఆశించిన మేర ఆడలేదు. ఇదే సమయంలో ఓం రౌత్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో రాముడి పాత్రలో డార్లింగ్ , సీత పాత్రలో కృతీ సనన్ నటించినా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాతం చోటు చేసుకుంది. తాజాగా మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సినిమా తీస్తున్నాడు. మొత్తంగా ప్రభాస్ నటించే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ కూడా రిలీజ్ కానుంది.