ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఖుష్ క‌బ‌ర్ 16న టీజ‌ర్

డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్

డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పారు ద‌ర్శ‌కుడు మారుతి. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రాజా సాబ్ గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వ‌స్తోంది ఈ మూవీ. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు రాజా సాబ్ ను. ఇవాళ రేపు అనుకూంటూ దాట‌వేస్తూ వ‌స్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు మారుతి నిర్వాకంపై. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. సినిమా అనేది త‌న ఒక్క‌డి వ‌ల్ల‌నో లేక ప్ర‌భాస్ వ‌ల్ల‌నో పూర్తి కాద‌న్నాడు. చాలా మంది ఒకే స‌మ‌యంలో స‌మిష్టిగా క‌ష్ట‌ప‌డితే మూవీగా మీ ముందుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

చిత్రాన్ని తీయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు తాను తీసిన ఏ మూవీ అయినా ఫెయిల్ కాలేద‌ని పేర్కొన్నాడు మారుతి. ఇక కీల‌క స‌న్నివేశాలు పూర్త‌య్యాయ‌ని, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మెచ్చుకునేలా ఉంటుంద‌ని జోష్యం చెప్పాడు. ఎలాంటి అనుమానాల‌కు తావు లేకుండా ఇప్ప‌టికే ఇచ్చిన మాట ప్ర‌కారం రాజా సాబ్ మీ ముందుకు రాబోతోంద‌ని ప్ర‌క‌టించాడు.

ఇందులో భాగంగా రాజా సాబ్ ప్ర‌భాస్ మూవీ టీజ‌ర్ ను ఈనెల 16వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని తెలిపాడు మారుతి. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5వ తేదీన రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. ఫ్యాన్స్ కు ఊపు తీసుకు వచ్చేలా తీపి క‌బురు చెప్పాడు. ఇక ఈ మూవీలో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ తో పాటు మ‌రికొంద‌రు కీల‌క పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com