Prabhas- Raja Saab Excitement :ప్ర‌భాస్ రాజా సాబ్ టీజ‌ర్ పై ఉత్కంఠ

సినిమా ఆల‌స్యంపై ఫ్యాన్స్ మారుతిపై ఫైర్

Prabhas- Raja Saab Excitement

Raja Saab : డార్లింగ్ ప్ర‌భాస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను మ్యాక్సిమం హీరోగా పేరొందాడు. వ‌రుస‌గా మూవీస్ చేస్తూ త‌న‌కు ఎదురే లేద‌ని చాటుతున్నాడు. తాజాగా త‌ను సుజిత్ తో న‌టిస్తుండ‌గా మ‌రో మూవీకి కూడా సంత‌కం చేశాడు. త‌ను ఎవ‌రో కాదు ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గా పేరు పొందిన వంగా సందీప్ రెడ్డి. త‌నతో స్క్రీన్ షేరు చేసుకున్నాడు. స్పిరిట్ టైటిల్ ను ఖ‌రారు చేశారు. దీనిపై ఇంకా మొద‌లు పెట్ట‌కుండానే మార్కెట్ అంతకంత‌కూ పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ మూవీ త‌ర్వాత నానితో సుజిత్ కొత్త మూవీ చేయ‌నున్నాడు.

Raja Saab Movie Updates

త‌ను న‌టిస్తున్న సినిమా రాజా సాబ్(Raja Saab). దీనికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇంకా కొన్ని స‌న్నివేశాల‌తో పాటు ఓ పాటను చిత్రీక‌రించాల్సి ఉంది. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ ప‌నులు మిగిలి ఉన్నాయి. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ , మాళ‌విక మోహ‌న్ , రిద్ది కుమార్ న‌టిస్తున్నారు. దీనిని పూర్తిగా కామెడీ, క్రైమ్ క‌థాంశంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అయితే రోజు రోజుకు ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆగ్ర‌హంతో ఉన్నారు మారుతిపై.

విచిత్రం ఏమిటంటే రాజా సాబ్ కు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. దీనికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు. గ‌త ఏప్రిల్ నెల 10న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది దీనిని. మేజ‌ర్ సినిమా షూటింగ్ వ‌ర్క్ పూర్తి కావ‌డంతో త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ ను రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ ఎందుకు ఇంత ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : Beauty Katrina Kaif :తెలుగు తెర‌పై మ‌రోసారి డ్రీం గ‌ర్ల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com