అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్నాడు దర్శకుడు మారుతి. తను మేకింగ్ , టేకింగ్ లో డిఫరెంట్ గా తీస్తాడన్న పేరుంది. ఈ సమయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ , మాళవిక మోహన్ కీ రోల్స్ పోషిస్తున్నారు రాజా సాబ్ మూవీలో. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని టాక్. ఇప్పటి దాకా పోస్టర్స్, గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వేచి ఉండలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడిని టార్గెట్ చేశారు.
ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో బిజీగా ఉన్న ప్రభాస్ హైదరాబాద్ కు రానున్నారు. తను వచ్చిన వెంటనే ఫుల్ బిజీగా మారనున్నాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ లో నటించనున్నాడు. డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే స్పిరిట్ లో కీలక రోల్ పోషిస్తున్నాడు. తన జతన త్రుప్తి దిమ్రీ కీ రోల్ పోషిస్తుందని ప్రకటించాడు దర్శకుడు.
ఈ తరుణంలో కీలక ప్రకటన రానుందని సమాచారం. రాజా సాబ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రాజా సాబ్ లోని ప్రభాస్ న్యూ లుక్ లీక్ అయ్యింది. ఇది సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇదే క్రమంలో జూన్ 6న రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ టాలీవుడ్ లో.
ఇక రాజా సాబ్ విషయానికి వస్తే ప్రభాస్ ను పూర్తిగా రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో నటింప చేస్తుండడంతో అంచనాలు పెరిగాయి. కంటెంట్ పై ఫోకస్ పెట్టడంతో మరింత బజ్ పెరిగింది. నిధి అగర్వాల్ తో పాటు సంజయ్ దత్, రిద్దీ కుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ తదితరులు కీ రోల్స్ పోషిస్తున్నారు.