Prakash Raj : తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్

ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ విషయానికి వస్తే....

Hello Telugu - Prakash Raj

Prakash Raj : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Prakash Raj Comment

ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం మరియు అతి పెద్ద పాపం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయండి. ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్టయ్యారు’’ అంటూ హిందూ ఐటీ విభాగం నుండి వచ్చిన ట్వీట్‌కు..‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు‌ను వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం సరైనదిగా ఉందని, జాతీయస్థాయిలో ‘సనాతన ధర్మరక్షణ బోర్డు’ అవసరం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కౌంటరేస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో.. ‘‘డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ వల్లే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయంటూ.. కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com