Prithviraj Sukumaran: సినిమాలో పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ !

సినిమాలో పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ !

Hello Telugu - Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘సలార్‌’ సినిమాలో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. దర్శకుడిగా, నటడిగా మలయాళంలో మంచి గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌… ‘సలార్‌’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. దీనితో ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్న ‘ఆడు జీవితం’ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమలపాల్‌ కథానాయిక. ‘దిగోట్‌ లైఫ్‌’ పేరుతో ఇంగ్లీష్‌ లో ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్‌(Prithviraj Sukumaran) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Prithviraj Sukumaran Dedication

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాలో నేను నజీబ్‌ అనే బానిస పాత్ర పోషించాను. దానికోసం 31 కిలోలు బరువు తగ్గాను. జిమ్‌ ట్రైనర్‌, పోషకాహార నిపుణులు, డాక్టర్స్‌ పర్యవేక్షణలో ఇది సాధ్యమైంది. వారు నన్ను విశ్రాంతి తీసుకోమని సూచించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్‌లో ఉండాల్సి వచ్చేది. కరోనా లాక్‌ డౌన్‌ తో చిత్రబృందం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. పశ్చిమాసియాలోని జోర్డాన్‌ ప్రాతంలో ఈ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు లాక్‌ డౌన్‌ ప్రకటించారు. మూడు నెలలు జోర్డాన్‌ రాయల్‌ ఫిల్మ్‌ కమిషన్‌ మమ్మల్ని ఆదరించింది. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం. ఈ విషయాలను తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనిపింది. అందుకే చెప్పాను’’ అని పృథ్వీరాజ్‌ వెల్లడించారు.

జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆడు జీవితం’. థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కథానాయకగా నటించగా ఆస్కార్ అవార్డు గ్రహీతలు A.R.రెహమాన్ సంగీతం అందించగా, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి, భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ వంటి టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సునీల్ కె ఎస్ చేస్తుండగా.. కథను బెన్యామిన్ అందిస్తున్న ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Also Read : Ustaad Bhagat Singh : ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో షాక్ ఇచ్చిన ఉస్తాద్ టీమ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com