Priyanka Chopra : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. ప్రేమకు కులంతో, మతంతో, వయసుతో పనేంటి అంటూ ప్రశ్నించింది. తనకంటే చిన్నోడైన నిక్ జోనాస్ లవ్ లో కూరుకు పోయింది. చివరకు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో స్థిర పడింది. ఈ మధ్యనే తను హాట్ టాపిక్ గా మారింది.
Priyanka Chopra Praises
తను దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం అడ్వెంచర్ గా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియంలో భారీ సెట్టింగ్ లో తను పాల్గొంటోంది.
అంతే కాకుండా ఏకంగా భారీ ఎత్తున పారితోషకం తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క మూవీ కోసం ప్రియాంక చోప్రా(Priyanka Chopra) రూ. 30 కోట్లు కావాలని అడిగిందని, ఇందుకు మూవీ మేకర్స్ సైతం ఓకే చెప్పారని టాక్.
తనకు నిక్ జోనాస్ అంటే చచ్చేంత ఇష్టమని స్పష్టం చేసింది. జీవితం ఆనందం కావాలంటే ప్రేమించడం నేర్చు కోవాలి. అది గనుక లేక పోతే లైఫ్ నిస్సారమవుతుందని పేర్కొంది ప్రియాంక చోప్రా.
ప్రస్తుతం తను లవ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Hero Vicky-Katrina :విక్కీ యాక్షన్ కత్రినా రియాక్షన్
