ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసే ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. తన తాత, దివంగత విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దిగ్గజ దర్శకుల వద్ద పని చేశాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న డ్రాగన్ లో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తొలి షెడ్యూల్ ను కర్ణాటకలో చిత్రీకరిస్తున్నాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తీయ బోతున్నట్లు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ వినిపించాడని , తను కూడా ఓకే చెప్పాడని, ఇది పూర్తిగా ఇథిహాసానికి సంబంధించినదని సినీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, జగపతిబాబు, సునీల్ , తదితరులు నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచింది.
తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంచలన ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి టాలీవుడ్ లో. ఇక త్రివిక్రమ్ తొలుత ఈ కథను బన్నీతో తీయాలని అనుకున్నాడు. కానీ తను హాలీవుడ్ రేంజ్ లో అట్లీ తీయబోయే మూవీలో బిజీగా ఉన్నాడు. తారక్ తో త్రివిక్రమ్ తీసే మూవీకి నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాక్. విచిత్రం ఏమిటంటే ఎక్స్ లో రాస్తూ..నాకు అత్యంత ఇష్టమైన అన్న..అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారంటూ కార్తికేయుడి పద్యాన్ని పంచుకున్నారు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. వీరి కాంబోలో మూవీ రాబోతోందని.
