Puja Gandhi : భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దండుపాళ్యం’ తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన పూజా గాంధీ త్వరలో పెళ్ళి పీటలెక్కనుంది. బెంగుళూరుకు చెందిన ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్‌ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు శాండల్ వుడ్ వర్గాల సమాచారం. అయితే తన పెళ్లికి సంబంధించి పూజా గాంధీ… ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. కాని అనివార్య కారణాల వలన వారి బంధం నెల రోజులకే ముగిసిపోయింది. అంతకుముందే సినిమా డిస్ట్రిబ్యూటర్ కిరణ్‌ను పూజా గాంధీ పెళ్లి చేసుకున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.
Puja Gandhi – కన్నడ నేర్పిన వ్యక్తినే పెళ్ళాడబోతున్న పూజా గాంధీ
ముంగారు వర్మ సినిమాతో శాండల్ వుడ్ లో అడుగుపెట్టిన పూజా గాంధీకు(Puja Gandhi)… విజయ్ అనే వ్యక్తి కన్నడ నేర్పించాడు. దీనితో ఆమె ముంగారు మగ, మిలనా, కృష్ణ, తాజ్ మహల్, బుద్ధివంత, అను, గోకుల వంటి సినిమాలతో కన్నడ నాట ఫేమస్ హీరోయిన్ గా మారింది. విజయ్ సహకారంతోనే పూజా గాంధీ కన్నడ నేర్చుకుని సినిమాల్లో ఫేమస్ అయినట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరి పరిచయం… స్నేహం, ప్రేమను దాటి పెళ్లిబంధానికి దారి తీసిందని శాండల్‌వుడ్ సినీ వర్గాల టాక్. భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా తెలుగులో కూడా వచ్చిన దండుపాళ్యం తో తెలుగు ప్రేక్షకుల్లో పూజా గాంధీ చెరగని ముద్ర వేసుకుంది.
హాట్ అండ్ సెక్సీ క్రైమ్ హీరోయిన్ గా పూజా గాంధీ
ఉత్తరప్రదేశ్ కు చెందిన పూజా గాంధీ 2001లో ”ఖత్రోన్ కే ఖిలాడి” సినిమాతో బాలీవుడ్ లోనికి అడుగుపెట్టి… హిందీతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. కన్నడంలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో కలిసి ముంగారు వర్మ సినిమాలో నటించిన పూజా గాంధీ… కన్నడ సినీరంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా, అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. పూజా గాంధీ కన్నడ సినీరంగంలో మగ హుడుగి అని పిలుస్తారు. బెంగుళూరు టైమ్స్”25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2012″ జాబితాలో పూజా గాంధీ చేర్చింది.
Also Read : Kantara Chapter 1: వచ్చేసింది ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్
