Diljit Dosanjh : ప్రపంచ గాయనీ గాయకుల్లో ఒకడిగా పేరు పొందాడు పంజాబ్ కు చెందిన భారతీయ సింగర్ దిల్జిత్ దొసాంజే. తను గాయకుడే కాదు నటుడు కూడా. ఆ మధ్యన తను నటించిన మూవీ రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులు తనకు బ్రహ్మరథం పట్టారు. అక్కున చేర్చుకున్నారు. తను పాడటం మొదలు పెడితే వేలాది మంది ఫిదా కావాల్సిందే. తన గాత్రానికి అంత మహత్తు ఉంది. ఈ పాటల చెలికాడు ఈ మధ్యన వైరల్ గా మారాడు. అదేమిటో తెలుసు కోవాలంటే షాక్ గురి కావాల్సిందే.
Diljit Dosanjh Sensational
తను ప్రతిష్టాత్మకమైన మెట్ గాలా ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఈ కార్యక్రమానికి వేదికైంది మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్. ఇక్కడ తొలిసారిగా కనిపించాడు దిల్జిత్(Diljit Dosanjh). వరల్డ్ టాప్ డిజైనర్ ప్రబాల్ గురుంగ్ ప్రత్యేకంగా తయారు చేసిన డిజైన్ ను ధరించాడు. దీంతో తళుక్కున మెరిశాడు టాప్ సింగర్. ఈ ఫ్యాషన్ ఈవెంట్ ఆద్యంతమూ ఆహ్లాదకరంగా సాగింది.
పంజాబీ పాటియాలా మహారాజ్ లుక్ లో కనిపించాడు దిల్జీత్. క్రీమ్ కలర్ కుర్తా ధరించాడు. మెడలో ముత్యాల హారాలు పొదిగిన నెక్లెస్ ను ధరించడం, సంచలనంగా మారింది. ఈ డైమెండ్లు పొదిగిన నెక్లెస్ ధర అక్షరాల రూ. 21 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. మొత్తంగా తను గాయకుడే కాదు ఈవెంట్ లో తనకు సాటి రారు ఎవరూ అంటూ నిరూపించాడు ఈ పంజాబీ సింగర్.
Also Read : Operation Sindoor Sensational :ఆపరేషన్ సిందూర్ పోస్టర్ హల్ చల్