Rahasya Gorak : ర‌హ‌స్య ప్రేమ‌లో ప‌డిందా

అబ్బ‌వ‌రంతో చెట్టా ప‌ట్టాల్

సినీ వాలిలో ఎప్పుడు ఎవ‌రికి ఎలా ప్రేమ పుడుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఒక్కోసారి వెండి తెర‌పై ప్రేమ పండిస్తే చూసి త‌రించే వాళ్లు కోకొల్ల‌లు. అందుకే సినిమా అంటే అంత పిచ్చి. మ‌నుషుల భావోద్వేగాల‌ను ప‌లికించే ఏకైక సాధ‌నం మూవీ.

ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా చివ‌ర‌కు సినిమాకే ఎక్కువ‌గా జ‌నం క‌నెక్ట్ అవుతున్నారు. త‌మ‌ను తాము మైమ‌రిచి పోతున్నారు. కార‌ణం జీవితంలో అనుకున్న‌వి ఏవీ జ‌ర‌గ‌వు. కానీ కావాల్సిన‌వ‌న్నీ జ‌ర‌గాలంటే సినిమాలో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.

ఇక సినీ రంగానికి సంబంధించి రోజుకో కొత్త వార్త అప్ డేట్ వ‌స్తూ ఉంది. నిన్న మొన్న‌టి దాకా వ‌రుణ్ తేజ్ హాట్ టాపిక గా మారితే. ఇప్పుడు కిర‌ణ్ అబ్బ‌రం ఆ ప్లేస్ లోకి వ‌చ్చాడు. మ‌నోడు మంచి న‌టుడు. బాగా మార్కులు కొట్టేశాడు. త‌ను క‌లిసి న‌టించిన హీరోయిన్ తో చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతున్న‌ట్లు టాలీవుడ్ లో గుప్పుమంటోంది.

ఆమె ఎవ‌రో కాదు త‌ను న‌టించిన తొలి సినిమా రాజా వారు రాణి గారులోని హీరోయిన్ ర‌హ‌స్య గోర‌ఖ్. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించాడు అబ్బ‌వ‌రం. ఈ వార్త‌కు చెక్ పెడుతూ ల‌వ్ లో ఉన్న‌ట్టు అయితే సంకేతాలు ఇచ్చాడు కానీ ఎవ‌ర‌నేది తెలియ ప‌ర్చ‌క పోవ‌డం విశేషం. అంద‌రూ మాత్రం గోరఖే అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com