Coolie : తమిళ సీనీ రంగంలో తలైవా రజనీకాంత్ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. తను గతంలో నటించిన జైలర్ రికార్డుల మోత మోగించింది. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వసూళ్లు చేసి విస్తు పోయేలా చేసింది. తాజాగా తను కీ రోల్ పోషిస్తున్నాడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ(Coolie) చిత్రంలో. ఇప్పటికే బిగ్ డిమాండ్ ఉంది మార్కెట్ పరంగా. తన రెమ్యూనరేషన్ ఎవరూ ఊహించని రీతిలో ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ఇచ్చినట్లు టాక్.
Rajinikantha Coolie Movie Teaser Updates
ఇక సినిమా విషయానిక వస్తే దమ్మున్న డైరెక్టర్ గా పేరొందాడు లోకేష్ కనగరాజ్. తన నుంచి మూవీ వస్తుందంటే చాలు మార్కెట్ కచ్చితంగా పాజిటివ్ గా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల్లో ఉంది. అందుకే పూర్తిగా తనపై నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఈ తరుణంలో రోజుకో అప్ డేట్ ఇస్తూ వచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన టేకింగ్ మేకింగ్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తాను కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఇది ఇతర సినీ దర్శకులను ఆలోచించేలా చేసింది.
దీన్ని బట్టి చూస్తే లోకేష్ కనగరాజ్ కు సినిమా మీద తనకున్న నిబద్దత ఏపాటిదో అర్థం అవుతుంది. ప్రమోషన్స్ ను ప్రారంభించాడు. కొత్త పోస్టర్స్ , టీజర్ ను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేసిన దర్శకుడు తాజాగా మరో కీలక టీజర్ ను విడుదల చేశాడు. 100 రోజుల దూరం ఉండడంతో దాని పేరు మీదే రిలీజ్ చేయడం విశేషం. పకడ్బందీగా కూలీని రూపొందించాడు. ఇది రూ. 1000 కోట్ల మార్క్ ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో లోకేష్ కనగరాజ్ సంచలన ప్రకటన చేశాడు. ఆగస్టు 14న కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు.
Also Read : Hero Dhanush-Kuberaa :కుబేర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్