Vettaiyan Movie : రజనీకాంత్ ‘వెట్టయన్’ ట్రైలర్ పై అభిమానుల ప్రశంసలు

ఇక మరో వర్గం తమిళ సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తున్న ధోరణిపై మండిపడుతున్నారు...

Hello Telugu - Vettaiyan Movie

Vettaiyan : సూప‌ర్‌స్టార్ రజనీ కాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ సాధిస్తుంది. సూపర్ రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్‌లతో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఈ మూవీలో రజినీని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నేరస్థుల పాలిట డ్యాషింగ్‌గా వ్యవహరించే సూపర్ కాప్‌గా చూపించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ చుసిన తర్వాత కొందరు మేధావులు దర్శకుడు జ్ఞాన‌వేల్‌పై మండిపోతున్నారు.

Vettaiyan Movie Trailer Updates

ఎందుకంటే.. 2021లో విడుదలైన సూర్య మూవీ ‘జై భీమ్’ చిత్రంతో డైరెక్టర్ జ్ఞాన‌వేల్ కమర్షియల్‌గా హిట్ కొట్టడంతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు పొందాడు. ఆయన తాజా సినిమా వేట్టయన్- ద హంట‌ర్‌(Vettaiyan) ట్రైలర్ కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతుంది. అయితే జై భీమ్ చిత్రం ద్వారా పోలీసుల కస్టడీ వైయలెన్స్‌ని అంతగా చూపించి ఇందులో మాత్రం “ఎన్కౌంటర్ స్పెషలిస్ట్” గా రజనీకాంత్‌ని గ్లోరిఫై చేయడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ‘ఒకట్రెండు సినిమాలు చూసి నటుల్ని, దర్శకుల్నీ నెత్తిన పెట్టుకోవద్దు. కోర్ వ్యాల్యూస్ ఏమిటి, ప్రాపంచిక దృక్పథం ఏమిటి అనేది చూడాలి, ఎవరిలోనైనా’ అంటూ జ్ఞాన‌వేల్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. మరొకరు పోలీసుల్ని ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ చేసేవాళ్ళుగా చూపించే కామెడీకి ఇక అంతుండదు కాబోలు మన సినిమాల్లో అంటూ ఫైర్ అయ్యారు. కాగా మరోవైపు సినిమాలో చూపించిన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌కి మాత్రం పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి.

ఇక మరో వర్గం తమిళ సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తున్న ధోరణిపై మండిపడుతున్నారు. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేస్తున్నపుడు తెలుగు టైటిల్స్ పెట్టకుండా ఇదేం పోకడ అని అసహనం వ్యక్తపరుస్తున్నారు. వేట్టయన్(Vettaiyan) అంటే తెలుగులో వేటగాడు అని అర్థం ఆ విధంగా టైటిల్ పెట్టొచ్చు కదా.. ఒకప్పడు అనువాదాలతో టైటిల్స్ వచ్చేవి ఇప్పటి తీరు బాగాలేదు అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ ఏడాది రిలీజైన ‘తంగలన్’ సినిమాని అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేయడంతో తెలుగు అభిమానుల్లో అసహనం ఏర్పడింది. అయితే తంగలన్ అనేది ఒక జాతి పేరు కావడంతో కొంతమంది ఆ సినిమా టైటిల్‌ని మినహాయించాలని అంటున్నారు. మరోవైపు ఇతర భాషల్లో అనువాదిస్తున్న తెలుగు చిత్రాలకు ఆయా భాషల్లోనే మూవీ టైటిల్స్ పెడుతున్నారు.

Also Read : Mamitha Baiju : ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు భామ మమిత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com