Rajinikanth : ఎవరైనా 50 ఏళ్లు వస్తే చాలు ఎందుకు బతకాలి. ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఇంకొందరు ఏదో ఒక వ్యాపాకాన్ని అలవాటు చేసుకుని టైం పాస్ చేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం ఏజ్ పెరిగినా దాని గురించి అస్సలు ఆలోచించరు. అలాంటి వారిలో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు భారతీయ సినిమా ఇండస్ట్రీలో . ఒకరు కోట్లాది మంది ఫ్యాన్స్ ను కలిగి ఉన్న ఏకైక తమిళ హీరో తలైవా రజనీకాంత్(Rajinikanth) కాగా. మరొకరు బాలీవుడ్ కు చెందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్.
Rajinikanth Craze
ఒకనాడు ఆస్తులన్నీ అమ్మేసుకుని దివాళా అంచున నిలబడిన ఈ అగ్ర నటుడు ఇప్పుడు ఎవరూ అందుకోలేని రేంజ్ లో కి వెళ్లాడు. తన వయసు కూడా పెరిగినా నటిస్తూనే , యాంకరింగ్ చేస్తూనే కాసులు గడిస్తున్నాడు. ఏజ్ అన్నది శరీరానికే కానీ మనసుకు కాదని స్పష్టం చేశాడు. యంగ్ హీరోలకు ఆదర్శ ప్రాయంగా నిలిచాడు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. అందమైన భామలతో పోటీగా డ్యాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇక కన్నడ సినిమా రంగానికి వస్తే శివ రాజ్ కుమార్. ఓవైపు తాను అనారోగ్యానికి గురైనా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా తను రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు సన తీస్తున్న పెద్దిలో కీ రోల్ పోషించాడు.
ఇక అసలు విషయానికి వస్తే రజనీకాంత్(Rajinikanth) తో యంగ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ తీస్తున్నాడు. దీనిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ప్రముఖ తమిళ చలన చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. దీని అధినేత దయానిధి మారన్ ఏకంగా ఇందులో కీ రోల్ పోషించినందుకు రజనీకాంత్ కు ఏకంగా రూ. 260 కోట్లకు పైగా ఫీజు కింద ఇచ్చినట్టు టాక్. ఇందులో భారీ ప్రధాన తారాగణం నటిస్టోంది. ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డ్ ల మోత మోగిస్తోంది.. మొత్తంగా రజనీకాంతా మజాకా అంటున్నారు ఫ్యాన్స్. తన ఏజ్ ఇప్పుడు 72 ఏళ్లు. అయినా ఎక్కడా తగ్గడం లేదు.
Also Read : Kannappa Sensational :కన్నప్ప మూవీ ప్రమోషన్స్ షురూ
