తమిళ సినీ పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక హీరో రజనీకాంత్. 70 ఏళ్లకు పైబడినా ఇంకా నటిస్తూనే ఉన్నారు. తన స్టార్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. తనతో సినిమాలు తీసేందుకు ఇప్పటికీ దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. గత ఏడాది తను నటించిన జైలర్ ఎవరూ ఊహించని రీతిలో రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది మరో కొత్త మూవీతో ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే సదరు చిత్రం కూలీ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కెవ్వు కేక అనిపించేలా ఉండడంతో అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. దర్శకుడి టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా రజనీకాంత్ మేనరిజంను మరింత కొత్తగా కనిపించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక నటన గురించి ప్రత్యేకంగా తలైవా గురించి చెప్పాల్సిన పని లేదు.
ఇక కూలీ చిత్రానికి ప్రముఖ తమిళ సినీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండడంతో తలైవా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కూలీ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తలైవా అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వేచ్ఛ లభించిన ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా కూలీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. దీంతో కూలీపై మరింత బజ్ పెరిగేలా చేసింది.
కూలీలో భారీ తారగణం ఉండడం ప్లస్ పాయింట్ కానుంది. రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ఉపేంద్రతో పాటు మరికొందరు నటులు ఇందులో భాగం పంచుకుంటున్నారు. కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ప్రారంభం రోజునే వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లు కలెక్షన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే మార్కెట్ కొనసాగుతోంది. ఓవర్సీస్ రైట్స్ ఏకంగా కూలీకి సంబంధించి రూ. 80 కోట్లకు అమ్ముడు పోయినట్లు కోలీవుడ్ లో టాక్.