Illayaraja : యావత్ భారత దేశం ఇళయరాజాను చూసి గర్విస్తోందంటూ ప్రశంసలు కురిపించారు భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్. ఆయన స్వర మాంత్రికుడంటూ పేర్కొన్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతం ద్వారా ప్రాణం పోశాడని కితాబు ఇచ్చాడు. తాను కూడా ఆయనకు అభిమానని చెప్పారు. ఇళయరాజా సాధించిన అరుదైన ఘనతను ప్రత్యేకంగా ప్రస్తావించింది రాజ్యసభ. పెద్దల సభ హర్ష ధ్వానాల మధ్య సంగీత దర్శకుడికి అభినందనలు తెలియ చేసింది. ఈ సందర్బంగా తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు మ్యూజిక్ మ్యాస్ట్రో.
Illayaraja Got Appreciations
ఇదిలా ఉండగా ఇళయరాజా(Illayaraja) ఇటీవల మార్చి 8న వాలియంట్ అనే సింఫనీతో లోడాన్ లో అరంగేట్రం చేశారు. ఈ ప్రకియను చేసిన తొలి ప్రయోగం చేసిన తొలి భారతీయుడిగా , సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది కేంద్ర సర్కార్. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి ఇళయరాజాను కలిశారు. తనపై ప్రశంసలు కురిపించారు. మిమ్మల్ని చూసి 143 కోట్ల భారతీయులు గర్వ పడుతున్నారని అన్నారు.
ప్రధాని మోదీతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందలతో ముంచెత్తింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజాను ప్రశంసలతో ముంచెత్తారు. ఇళయరాజా వ్యక్తి కాదని ఆయన ఓ సంగీత శిఖరమని కొనియాడారు సీఎం. రాజ్యసభ ఘనంగా సత్కరించింది సంగీత దర్శకుడిని, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖర్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఐదు దశాబ్దాలుగా తన సంగీతంతో అలరిస్తూ వస్తున్న ఈ దిగ్గజాన్ని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : నాన్నా నువ్వు కలకాలం బాగుండాలి
