గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , జాన్వీ కపూర్ కాంబోలో వస్తున్న చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు సంబంధించి కర్ణాటకలో ముఖ్యమైన సీన్స్ చిత్రీకరించారు. దాదాపు 30 శాతానికి పైగా షెడ్యూల్ పూర్తయింది. వేసవి కాలం విడిది కోసం కొంత గ్యాప్ ఇచ్చాడు చెర్రీ. ఆ సమయంలో తన సినిమాకు సంబంధించి మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశాడు దర్శకుడు. తన టేకింగ్ మేకింగ్ అనేది ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉంటుంది. ఆ విషయం ఇటీవలే పెద్ది మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడే అర్థమై పోయింది. తనకు గ్రామీణ నేపథ్యం అంటే చచ్చేంత ఇష్టం.
దానినే మరోసారి రివీల్ చేయనున్నాడు పెద్ది చిత్రం ద్వారా. ఆ విషయాన్ని తానే కన్ ఫర్మ్ చేశాడు కూడా. ఇటీవల చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్నాడు. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ తళుక్కున మెరుస్తాడు. సో ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోందని అర్థమై పోయింది.
ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన మూవీ శంకర్ తీసిన గేమ్ ఛేంజర్. అది బొక్క బోర్లా పడింది. దీంతో కొంత మనస్థాపానికి గురయ్యాడు. తన స్టార్ ఇమేజ్ ఏ మాత్రం మూవీని గట్టెక్కించ లేక పోయింది. దీనిని నిర్మించిన దిల్ రాజు లబోదిబోమన్నాడు. ఆ తర్వాత తను తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తనను రోడ్డు పాలు కాకుండా చేసింది. దీనిని అనిల్ రావిపూడి తీశాడు. ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇక తాజాగా పెద్ది మూవీ విషయానికి వస్తే రామ్ చరణ్ తో కీలక సన్నివేశాలు తీసేందుకు హైదరాబాద్ లో భారీ సెట్టింగ్స్ వేశారు. దీనికి సంబంధించి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజున పెద్దిని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించాడు బుచ్చిబాబు సన.