Ram Charan : ఆర్ఆర్ఆర్ తరువాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ నటిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు కాస్తా టైం దొరికిందంటే చాలు… తన కుటుంబంలోనికి కొత్తగా అడుగుపెట్టిన కొణిదెల వారసురాలు క్లింకారా లేదా తను ఎంతగానో ఇష్టపడి పెంచుకుంటున్న పెట్ డాగ్స్ తోనే గడుపుతుంటాడు. రామ్ చరణ్(Ram Charan) కు ఖరీదైన కార్లు అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ… ఆ కార్ల కలెక్షన్లు ఇంట్లో పెట్టుకుంటాడు తప్ప హైదరాబాద్ లో ఆ కార్లలో షికార్లు చేయడం చాలా అరుదు.
Ram Charan – ఫెర్రారీ ఫోర్టోఫినోలో చరణ్ షికారు…
అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ కు కాస్తా గ్యాప్ వచ్చిందో ఏంటో గాని… రామ్ చరణ్ ఒక్కసారిగా కారులో షికారు చేసాడు. తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నఫెర్రారీ ఫోర్టోఫినోలో అలా షికార్లు చేసి వచ్చాడు. అయితే ఫెర్రారీ ఫోర్టోఫినోలో షికారు చేసి వచ్చిన రామ్ చరణ్… ఇంట్లోకి వెళ్తుండా ఓ వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రామ్ చరణ్ ఫెర్రారీ ఫోర్టోఫినో ను నడుపుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు.
దీనితో మరోసారి ఫెర్రారీ కారు… దాని ఖరీదు గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో కలిసి ఈ కారుతోనే ఫోటోలు దిగడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చరణ్ నడుపుతున్న ఫెర్రారీ కారు ఖరీదు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని దీనితో పాటు రోల్స్ రాయిస్, బెంజ్, రేంజ్ రోవర్, బిఎండబ్యూ, ఆస్టన్ మార్టిన్ వంటి ఖరీదైన మరో అరడజను కార్లు ఉన్నాయంటూ వాటి మోడల్స్, ఖరీదుతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
రామ్ చరణ్ కాస్ట్లీ కార్స్ కలెక్షన్
రోల్స్ రాయిస్ ఫాంటూమ్ — రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 – రూ.4 కోట్లు
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 – రూ. 3.2 కోట్లు
ఫెర్రారీ ఫోర్టోఫినో – రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ – రూ 2.75 కోట్లు
బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ – రూ 1.75 కోట్లు
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 450 ఏఎమ్‌జీ కూప్ – రూ. కోటి
Also Read : Prerana Kambam: పెళ్ళి చేసుకున్న సీరియల్ బ్యూటీ
