రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇది దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం పూర్తయ్యాక ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై ఉత్కంఠకు తెర పడనుంది. మొదటగా సుకుమార్ తనకు కథ వినిపించాడని, దానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్. ఇదే సమయంలో స్టోరీ పూర్తి చేయక పోవడంతో అది మరింత ఆలశ్యం కానుంది. ఈ గ్యాప్ లో ఎవరితో సినిమా చేయాలనే దానిపై రామ్ చరణ్ ఆలోచించాడని, చివరకు డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కన్ ఫర్మ్ చేసినట్లు పెద్ద ఎత్తున టాక్ టాలీవుడ్ లో.
ఇక ఈ ఏడాది తీవ్ర నిరాశ మిగిల్చేలా చేసింది రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. దీనిని భారీ బడ్జెట్ తో తీశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. బాక్సాఫీస్ వద్ద ఎత్తి పోయింది. చెర్రీ సినీ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనికి శంకర్ దర్శకత్వం వహించాడు. తలా తోకా లేకుండా తీశాడు. చివరకు పక్కన పెట్టేశారు ప్రేక్షకులు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ పోషించాడు రామ్ చరణ్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది.
ఆ తర్వాత నటించిన గేమ్ ఛేంజర్ ఆశించిన విధంగా ఆడక పోవడంతో రామ్ చరణ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తాజాగా బుచ్చిబాబు సన పెద్ది మూవీపై ఫోకస్ పెట్టాడు. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ కు భారీ ఎత్తున స్పందన లభించింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు చెర్రీ. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు .