గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సంచలనంగా మారాడు. తను కీ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఇప్పటికే రికార్డు మోత మోగిస్తోంది మార్కెట్ లో. దీనికి దర్శకుడు క్రియేటివిటీ కలిగిన బుచ్చిబాబు సన. తను ఉప్పెన తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా వచ్చింది. ఇప్పుడు తీస్తున్న చెర్రీ చిత్రం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ గా వస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే రివీల్ చేశాడు డైరెక్టర్.
కర్ణాటకలో 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది పెద్ది మూవీకి సంబంధించి. ఇప్పుడు డిఫరెంట్ లుక్ తో హైదరాబాద్ లో సెట్టింగ్ ఏర్పాటు చేశాడు. రామ్ చరణ్ జాయిన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కెవ్వు కేక అనేలా ఉందంటూ పేర్కొంటున్నారు అభిమానులు.
గత నెలలో పెద్ది చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు దర్శకుడు. దీనికి భారీ ఎత్తున ప్రజాదరణ లభించింది. మెగా ఫ్యామిలీ మొత్తానికి ఇంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామి. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న. చిరంజీవి కూడా ఇష్టమైన దైవం. అదే భావన , ఆరాధన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు కూడా వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్బంగా తన నుంచి ఓ ఆహ్లాదకరమైన ఫోటోను పంచుకోవడం విశేషం. పెద్దిలో చెర్రీ, జాన్వీ కపూర్ , శివ రాజ్ కుమార్ , ఎంఎస్ ధోనీతో పాటు దివ్వేందు నటించారు.