Natural Star Nani-Hit 3 :హిట్ 3 బిగ్ స‌క్సెస్ రామ్ చ‌ర‌ణ్ కంగ్రాట్స్

బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ..మూవీ

Natural Star Nani-Hit 3

Hit 3 : శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ స్టార్ నాని వ‌య‌లెంట్ గా న‌టించిన చిత్రం హిట్ 3. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అద్బుత‌మైన ఆద‌ర‌ణ పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా హింసాత్మ‌కంగా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. కొంద‌రికే న‌చ్చుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున ఆద‌రిస్తున్నారు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు.

Natural Star Nani – Hit 3 Movie Updates

సినీ వ‌ర్గాలు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలోకి చేరి పోయాడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ . హిట్ 3 బావుందంటూ కితాబు ఇచ్చాడు. ప్ర‌త్యేకించి నేచుర‌ల్ స్టార్ నాని న‌ట‌న అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించేందుకు ప్ర‌య్న‌తం చేసిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నును అభినందించారు. టేకింగ్, మేకింగ్ సూపర్ గా ఉంద‌న్నాడు.

హిట్ 3(Hit 3) మూవీలో నానితో పాటు అందాల క‌న్న‌డ తార శ్రీ‌నిధి శెట్టి కీ రోల్ పోషించింది. ప్ర‌త్యేకించి పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో ఇమిడి పోయాడు నేచుర‌ల్ స్టార్. అర్జున్ స‌ర్కార్ పాత్ర‌లో ఇర‌గ‌దీశాడు. ఈ పాత్ర ఎక్కువ‌గా న‌చ్చేలా చేసింది ఆడియ‌న్స్ ను . దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ సక్సెస్ తో దూసుకు పోవ‌డంతో మూవీ మేక‌ర్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ తేజ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. నా సోద‌రుడు నాని భిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల ఆనందంగా ఉంద‌న్నాడు.

Also Read : Hero Kiran Abbavaram-Ka : దాదా సాహెబ్ పుర‌స్కారం క ఉత్త‌మ చిత్రం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com