Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. దర్శక ధీరుడు జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో తను ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు. ఇదే సమయంలో ఆ సినిమాకు ఆస్కార్ పురస్కారం లభించింది. తాజాగా తనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రామ్ చరణ్ తో పాటు తను ప్రాణపదంగా ప్రేమించే కుక్కకు కూడా అరుదైన గౌరవం దక్కనుంది. మైనపు విగ్రహం పూర్తి కావచ్చింది. దీనిని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేస్తారు. తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఇది తోడ్పడుతుందన్నాడు రామ్ చరణ్.
Ram Charan Wax Statue
మైనపు మ్యూజియంలో తన విగ్రహం కూడా ఏర్పాటు కావడం తన జీవితంలో మరిచి పోలేనిదిగా పేర్కొన్నాడు. అంతే కాదు తను పెంచుకుంటున్న కుక్క పేరు రైమ్. దీనికి కూడా ఇందులో చోటు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. జీవితంలో కొన్ని అపురూపమైన క్షణాలు ఉంటాయని, వాటిలో జంతువులతో అనుబంధం కలిగి ఉండటమేనని పేర్కొన్నాడు రామ్ చరణ్(Ram Charan) ఈ సందర్బంగా. ఇదిలా ఉండగా ఈ వారాంతంలో అబుదాబిలో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డులను పురస్కరించుకుని మ్యూజియం ఒక ప్రత్యేక వీడియోను ఆవిష్కరించింది. ఆయన కుక్కకు కూడా మైనపు విగ్రహంలో చోటు దక్కనుందని పేర్కొంది.
మైనపు విగ్రహం తయారీకి సంబంధించి ఇటీవలే రామ్ చరణ్ తో పాటు రైమ్ కుక్కకు కూడా కొలతలు తీసుకున్నారు కళాకారులు. ఇదిలా ఉండగా ఈ ప్రతిష్టాత్మకమైన మ్యూజియంలో ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పేరుపొందిన కళాకారుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ కు సంబంధించి ప్రిన్స్ మహేష్ బాబు, ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు చెందిన మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు రామ్ చరణ్ కూడా చేరనున్నారు.
Also Read : Pahalgam Attack -Arijit Concert :పహల్గామ్ ఎఫెక్ట్ అర్జిత్ సింగ్ సంగీత కచేరి రద్దు
