Popular Actress Rambha :తిరిగి వ‌చ్చా సినిమాల్లో న‌టిస్తా

న‌టి రంభ షాకింగ్ కామెంట్స్

Rambha : త‌న న‌ట‌న‌, డ్యాన్సుల‌తో 1990 కాలంలో దుమ్ము రేపింది న‌టి రంభ‌. టాప్ హీరోల‌తో కీల‌క పాత్ర పోషించింది. త‌ను 15 ఏళ్ల‌కు పైగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ వ‌చ్చింది. పెళ్లి చేసుకుని కెన‌డాకు వెళ్లి పోయింది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల త‌న స్వంత గూటికి చేరుకుంది. రంభ(Rambha) వ‌చ్చేశాక ఫుల్ బిజీగా మారి పోయింది. ఓ వైపు రియాల్టీ షోస్ ఇంకో వైపు ప్ర‌మోష‌న్స్, ఈవెంట్స్ లో పాల్గొంటూ త‌న‌దైన శైలిలో స్పందిస్తోంది. ఈ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. చూస్తూ ఉండ‌గానే చాలా కాలం పూర్త‌యి పోయింది. అయినా సినిమాల‌కు దూరంగా లేన‌ని పేర్కొంది.

Popular Actress Rambha Comments

తాను ఎక్క‌డికి వెళ్లినా , ఏం చేసినా సినిమాల గురించి ఆస‌క్తి మాత్రం చంపు కోలేద‌న్నారు రంభ‌. అనుకోకుండా పీక్ స్టేజ్ లో ఉన్న స‌మ‌యంలోనే తాను పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పింది. కొంత కాలం పాటు విదేశాల్లో ఉన్నా. కొడుకు, పాప‌. ఇద్ద‌రూ చిన్న‌గా ఉన్న స‌మ‌యంలో వారి కోసం సినిమాల‌ను వ‌దిలి వేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. దీని కార‌ణంగానే తాను దూరంగా ఉన్నాన‌ని, ఇప్పుడు పిల్ల‌లు చేతికి వ‌చ్చార‌ని అందుకే తిరిగి ఇక్క‌డికి వ‌చ్చాన‌ని చెప్పింది రంభ‌.

ఇదిలా ఉండ‌గా త‌ను ఓ రియాల్టీ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. మంచి రెస్పాన్స్ కూడా వ‌స్తుండ‌డంతో సంతోషానికి లోన‌వుతోంది. కొడుక్కి ఆరేళ్లు, కూతుళ్ల‌కు 14, 10 ఏళ్లు నిండి పోయాయి. ఇక వారు స్వంతంగా ఉండ‌గ‌ల‌రు. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని తెలిపింది న‌టి. అయితే సినిమాల ప‌ట్ల త‌న‌కున్న పేష‌న్ గురించి త‌న భ‌ర్త‌కు తెలుస‌ని, అందుకే జ‌డ్జిగా వ‌చ్చేందుకు ఓకే చెప్పార‌ని ఈ జ‌ర్నీ చాలా బాగా ఉంద‌ని చెప్పింది రంభ‌. మ‌రోసారి వెండితెర‌పై క‌నిపించ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఏ సినిమా అనేది మాత్రం చెప్ప‌లేదు.

Also Read : Hero Allu Arjun-Atlee :పాన్ వ‌ర‌ల్డ్ మూవీపై బ‌న్నీ..అట్లీ బిజీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com