Rana Daggubati : టాలీవుడ్ హీరో, ఎంట్రప్రెన్యూర్ రానా దగ్గుబాటికి అరుదైన గౌరవం దక్కింది. డబ్ల్యుడబ్ల్యుఈ రెసిల్ మేనియాకు తొలిసారిగా ఇండియా నుంచి తొలి స్టార్ హీరోను ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఇది సినిమా పరంగా చరిత్ర సృష్టించారు. 41వ వార్షిక రెసిల్ మేనియా ఏప్రిల్ 19, 20వ తేదీలలో జరిగింది. జీవితకాలం డబ్ల్యుడబ్ల్యుఈ అభిమాని కావడం విశేషం. అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆట మొత్తాన్ని రాత్రి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేశారు. పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వచ్చింది.
Rana Daggubati Makes History
లాస్ వెగాస్‌లోని అల్లెజియంట్ స్టేడియంలో జరిగే మెగా షోడౌన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆహ్వానించబడిన తొలి భారతీయ సెలబ్రిటీగా నిలిచి చరిత్ర సృష్టించారు రానా దగ్గుబాటి(Rana Daggubati). నెట్‌ఫ్లిక్స్ షో రాణా నాయుడు రెండవ సీజన్‌లో త్వరలో కనిపించనున్న రానా దగ్గుబాటి ఈ ఉత్కంఠ భరితమైన అనుభవం గురించి మాట్లాడారు. ఈ క్రాస్‌ఓవర్ క్షణం భారతదేశంలోని అభిమానులకు పవర్‌హౌస్ వినోదాన్ని అందించడంలో నెట్‌ఫ్లిక్స్ నిబద్ధతను ఎలా హైలైట్ చేస్తుందో కూడా జోడించారు.
ఈ సందర్బంగా రానా దగ్గుబాటి లాస్ వెగాస్ నుండి మాట్లాడారు. రెసిల్ మేనియా 41లో పార్టిసిపేట్ కావడం ఆనందంగా ఉందన్నాడు. డబ్ల్యుడబ్ల్యుఈ మనందరి బాల్యంలో ఒక భాగమై పోయిందన్నాడు. ఇప్పుడు దానిని ప్రత్యక్షంగా చూడటం, ప్రవంచ వేదికపై భారత దేశం తరపు నుంచి ప్రాతినిధ్యం వహించడం జీవితంలో మరిచి పోలేని అనుభూతిగా మిగిలి పోతుందన్నాడు.
Also Read : Hero Ajith Kumar Car Race :కారు రేసింగ్ లో సత్తా చాటిన అజిత్ టీమ్
