Rana Daggubati : పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు

దాదాపు 40 నిమిషాల నిడివితో స్ర్టీమింగ్‌ అవుతుంది...

Hello Telugu - Rana Daggubati

Rana Daggubati : రానా దగ్గుబాటి హోస్ట్‌గా ‘ది రానా దగ్గుబాటి(Rana Daggubati) షో’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ నెల 23 నుంచి ఈ షో ప్రసారం కానుంది. దీని ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ వేడుకలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉత్తరాది ప్రేక్షకులెవరికీ తాను, ప్రభాస్‌ తెలియదని, బాహుబలి సినిమా ప్రచారానికి ముంబయి వెళ్లినప్పుడు తమని తాము పరిచయం చేసుకున్నామని అన్నారు.‘మీ షోని పాన్‌ ఇండియా స్టార్లతో కాకుండా టైర్‌ 2 హీరోలతో ప్రారంబించినట్టున్నారు ఎందుకు?’ అని అడగ్గా.. ‘‘అవేమైనా ట్రైన్‌ బెర్తులా..?’’ అని నవ్వుతూ ప్రశ్నించారు. ‘‘సినిమాలు తీేస వారికి లెక్కలు ఉండొచ్చుగానీ ప్రేక్షకుడికి ఉండవు. కంటెంట్‌ నచ్చితే చూస్తాడంతే. ప్రాంతీయ సినిమాగా రూపొందిన ‘హనుమాన్‌’ను ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులు చూశారు. ‘బాహుబలి’కి ముందు మేం కూడా బాలీవుడ్‌ ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు.

సినిమానే నటులను స్టార్‌లను చేస్తుంది. టైర్‌ 1, టైర్‌ 2 అనేది చెప్పుకోవడానికి బాగుంటుందేమోగానీ నేను దాన్ని నమ్మను’’ అని అన్నారు. ‘‘ఇంతకుముందు నేనే చేసిన షోకు, ఈ కొత్త ప్రోగ్రామ్‌కు సంబంధం ఉండదు. సోషల్‌ మీడియాలో జరిగిన చర్చలు, వార్తలు గురించి ఈ షోలో ఉండవు. ఒక్కో ఎపిసోడ్‌ను 4 గంటలపాటు చిత్రీకరించాం. దాదాపు 40 నిమిషాల నిడివితో స్ర్టీమింగ్‌ అవుతుంది. ఇందులో రిషబ్‌శెట్టి ఎపిసోడ్‌ చాలా స్పెషల్‌. నాకు కన్నడ రాదు. ఆయనకు తెలుగు రాదు. హిందీలో బాగా మాట్లాడతారు. కానీ, నాకు హిందీలో ప్రశ్నలు వేయడం రాదు. ఇద్దరికీ తమిళ్‌ కొంత మేర తెలుసు. దాంతోనే మేనేజ్‌ చేశా. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మా షోకు వచ్చే అవకాశం లేదు’’ అని తెలిపారు.

Rana Daggubati Comment

“ఈషో చాలా డిఫరెంట్. అందుకే దీనికి ‘రానా దగ్గుబాటి(Rana Daggubati) షో’ అని పేరుపెట్టాం. ఇది ఆర్డినరీ టాక్ షో కాదు! వెరీ ఆథెంటిక్, అన్ ఫిల్టర్డ్, అన్‌స్క్రిప్టెడ్ షో. షోలో కనిపించే సెలబ్రిటీల రియల్, ఫిల్టర్ చేయని జీవితాల్లోకి హైలీ ఎంటర్ టైనింగ్, ఇంటరాక్టివ్ విండో. వారితో, ఇండస్ట్రీతో నా కనెక్షన్ ఫ్యామిలీ లాంటిది. మా మాటలు, మేము పంచుకునే సమయాన్ని మరింత సరదాగా సహజంగా ప్రజెంట్ చేస్తుంది. సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే హానెస్ట్ గా, నేచురల్ గా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్ అవుట్ స్పాట్. సెలబ్రిటీల రియల్, యూనిక్ పర్సనాలిటీని ప్రజెంట్ చేస్తుంది. సెలబ్రిటీల గురించి చాలా కొత్త విషయాలని డిస్కవరీ చేసే షో ఇది. 240 దేశాలలో ఈ షో ప్రసారం కావడం హ్యాపీగా వుంది. ఈ షో ఆడియన్స్ కి డిఫరెంట్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది” అన్నారు.

Also Read : Diljit Dosanjh : ప్రముఖ పంజాబీ సింగర్ కు తెలంగాణ పోలీసుల నోటీసులు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com