Ramayan : నితీష్ తివారీ దర్శకత్వం వహించిన చిత్రం రామాయణం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇందులో కీలక పాత్రలు పోషించారు నేచురల్ నటి సాయి పల్లవి, హీరో రణ బీర్ కపూర్(Ranbir Kapoor) తో పాటు శాండిల్ వుడ్ స్టార్ హీరో యశ్ రావణాశురుడిగా కనిపించడడం విశేషం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా విడుదల కాకుండానే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రామాయణం. ఈ దేశంలోని ఇతిహాసాలలో రామాయణంకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతం, భాగవతం, రామాయణం దేనికదే ప్రత్యేకత.
Ramayan Movie Updates
ఇప్పటికీ కోట్లాది మంది భక్తులు ఇప్పటికీ, ఎల్లప్పటికీ రాముడిని కొలుస్తారు. సీతను తమ ఆదర్శ దేవతగా పూజించడం షరా మామూలే. ప్రేక్షకుల మనో భావాలు, బలహీనతనలను ఆసరాగా చేసుకుని సినీ ప్రముఖులు వరుసగా దేవతలకు చెందిన సినిమాలను తీస్తూ వస్తున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటించారు. ప్రస్తుతం కల్కి 2 పార్ట్ షూటింగ్ కొనసాగుతోంది.
కృతీ సనన్ కీలక పాత్ర పోషించిన ఆదిపురుష్ ఆశించిన మేర ఆడక పోయినా భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతకు కాసుల వర్షం కురిపించేలా చేసింది. తాజాగా రామాయణం మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరాఠా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ చిత్రం సెట్స్ ను తాను , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించామని, ఎంతో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరాడు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది దీపావళి రోజున రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు మూవీ మేకర్స్.
Also Read : Hero Vijay Deverakonda :హీరో అయితే నోరు పారేసుకుంటే ఎలా..?
