నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి సంచలనంగా మారారు. తను తాజాగా మైసా అనే హర్రర్ ,థ్రిల్లర్ మూవీలో కీ రోల్ పోషిస్తోంది. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు పాత్రల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ కెరీర్ ను తెలుగులో ఛలో చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదే సమయంలో రష్మిక మందన్నా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ ఇద్దరు కలిసి పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో బిజీగా మారి పోయింది రష్మిక మందన్నా. సుకుమార్ తీసిన పుష్ప -1 సెన్సేషన్ క్రియేట్ చేస్తే పుష్ప-2 వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 1867 కోట్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ చిత్రంగా రికార్డు నమోదు చేసింది.
తాజాగా మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో విజయ్ దేవరకొండ కంగ్రాట్స్ తెలిపాడు. ఇదే సమయంలో రష్మిక మందన్న స్పందించింది. తనను ప్రత్యేకంగా విజ్జూ థ్యాంక్స్ అంటూ సంబంధించింది. దీంతో రష్మిక , దేవరకొండలు పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.