నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వైరల్ గా మారారు. తను ఏది చేసినా అది సంచలనంగా మారుతోంది. తాజాగా తను హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ లో వెళుతుండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తను శేఖర్ కమ్ముల తీసిన కుబేరలో కీ రోల్ పోషించింది. ఇందులో అక్కినేని నాగార్జునతో పాటు తమిళ సినీ హీరో ధనుష్ తో కలిసి నటించింది. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో ఫ్లైట్ లో వెళుతుండగా నాగ్ తో పాటు బాలీవుడ్ వర్దమాన నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి రష్మిక మందన్నా స్వయంగా సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది .
ఇదిలా ఉండగా ఈ నేషనల్ క్రష్ కు గత ఏడాది నటించిన పుష్ప2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది మిశ్రమ స్పందన వచ్చింది. యానిమల్ బిగ్ హిట్ . ఆ తర్వాత పుష్ప , అనంతరం వచ్చిన ఛావా బిగ్ సక్సెస్ అయ్యాయి. కానీ సల్మాన్ ఖాన్ తో ఏఆర్ మురుగదాస్ తీసిన సికందర్ ఆశించిన మేర ఆడలేదు. అయినా ఎక్కడా నిరాశ చెందడం లేదు రష్మిక మందన్నా. తను చాలా బిజీగా మారి పోయింది. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తోంది.
ప్రస్తుతం తను నటించిన కుబేరపై గంపెడు ఆశలు పెట్టుకుంది. తను ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. భారీ ఎత్తున రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు టాక్. మొత్తంగా శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేరలో తను ఎలాంటి పాత్ర చేసిందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి గట్టెక్కిస్తాడా లేక నిరాశ పరుస్తాడా అనేది సినిమా విడుదలైతే కానీ చెప్పలేం.