ఒకప్పుడు బెడ్ రూమ్ వరకే పరిమితమై ఉండేది ముద్దైనా లేదా మురిపెమైనా. సీన్ మారింది. తరం మారింది. టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చాక, సోషల్ మీడియా డామినేషన్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు సినిమాకు ఉన్న ప్రతిబందకాలు ఏవీ ఉండడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు తీస్తున్నారు. ఉన్నా లేక పోయినా కథలో అప్రస్తుతమైనా సరే ముద్దుల్ని జొప్పిచ్చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కాబట్టే తాము తీస్తున్నామంటున్నారు దర్శక, నిర్మాతలు.
ఒకప్పుడు కిస్ అనేది నిషిద్దం. కానీ ఇప్పుడు బహిరంగంగానే కిస్సులతో హోరెత్తిస్తున్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. ఇక ఆ మధ్యన తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో రెచ్చి పోయాడు రౌడీ బాయ్ గా పేరు పొందిన విజయ్ దేవరకొండ. దీనికి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. ఇంకేం యూత్ కు నచ్చింది. సక్సెస్ అయ్యింది మూవీ. దానిని హిందీలో కూడా తీశాడు. అందులో షాహీద్ కపూర్.
తాజాగా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడు. దాని పేరే యానిమల్. రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. గతంలో సినిమాలలో ఇళ్లల్లో లేదా అవుట్ డోర్ లో హీరో, హీరోయిన్ల మధ్య కిస్ సీన్స్ ఉండేవి. తాజాగా రణ బీర్ కపూర్ తో రష్మిక మందనా లిప్ కిస్ వైరల్ గా మారింది. విచిత్రం ఏమిటంటే విమానంలో ముద్దు పెట్టుకోవడం .